రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

Mahindra XUV500
చిరుత పులి నుండి స్ఫూర్తి పొంది మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) రూపొందించిన గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" ఎట్టకేలకు రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. విశిష్టమైన లుక్, ప్రపంచ స్థాయి ఫీచర్లతో విపరీతమైన ప్రజాదరణను సొంతం చేసుకున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500ను మంగళవారం నాడు కంపెనీ అధికారికంగా హైదరాబాద్‌లో విడుదల చేసింది.

హైదరాబాద్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధర రూ.11.2 లక్షల నుండి రూ.12.57 లక్షల మధ్య ఉంది. కాగా.. తమ కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకూ తీసుకోనున్నామని, ఈ సమయంలో బుకింగ్‌ల సంఖ్య 7,200 యూనిట్లకుమించినట్లయితే, లక్కీడ్రా ద్వారా కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదిలా ఉండగా.. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని అందించాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 పూణేలోని ఛాక్కన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతుంది. ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 2,500 యూనిట్లు, ఈ సంఖ్యను త్వరలోనే 3,000 యూనిట్లకు పెంచేందుకు కంపెనీ కసరత్తులు చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 18, 2012, 12:13 [IST]
English summary
The Mahindra XUV 500 which created a sensation in the SUV market will be back. There were many people who were disappointed when Mahindra closed the bookings of its global SUV within eight days. In a statement to the media Mahindra and Mahindra has stated that it will open the XUV 500’s bookings from January 25th for a limited period of 10 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+