క్యూ2లో 22 శాతం పెరిగిన ఎమ్ అండ్ ఎమ్ నికర లాభం

By Ravi

Mahindra And Mahindra
ప్రముఖ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్‌ ఎమ్) గడచిన సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ సమయంలో కంపెనీ నికర లాభం 22 శాతం వృద్ధిని సాధించి 902 కోట్లుగా నమోదైంది. గత ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.737.4 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ గరిష్ట ఆదాయం 32.6 శాతం వృద్ధిని కనబరచి రూ.10,891.4 కోట్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో గరిష్ట ఆదాయం రూ.8,212 కోట్లగా రికార్డ్ అయింది. ఈ మూడు నెలల కాలంలో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న యుటిలిటీ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడటమే ఈ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించడానికి ప్రధాన కారణంగా కంపెనీ తెలిపింది.

ఈ సమయంలో ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో 32 శాతం వృద్ధిని నమోదు చేసి 62,751 యూనిట్లు విక్రయించామని కంపెనీ పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం మహీంద్రా క్వాంట్, ఇది వరకు ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ వెరిటో, రిఫ్రెష్డ్ జైలో, సరికొత్త బొలెరో, గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 వంటి ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది.

More from DriveSpark

Article Published On: Friday, October 26, 2012, 16:17 [IST]
English summary
India's largest utility vehicle manufacturer, Mahindra and Mahindra Ltd has reported 22 per cent rise in net profit of second quarter in the current fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+