ఎక్స్‌యూవీ500లో కూడా వాయిస్ కమాండ్ టెక్నాలజీ!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తాజాగా ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ వెర్షన్ ఎమ్‌యూవీ జైలోలో సరికొత్త వాయిస్ కమాండ్ టెక్నాలజీని ఉపయోగించి అందరినీ అశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే టెక్నాలజీని కంపెనీ అందిస్తున్న గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500లో కూడా ఆఫర్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా ఈ గ్లోబల్ మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఎస్‌యూవీకి ఇప్పటికే ప్రపంచ మార్కెట్ల నుండి మంచి స్పందన లభిస్తోంది. అయితే, భారత మార్కెట్లో ఉత్పత్తి పరిమాణం దేశీయ డిమాండును తీర్చడానికే సరిపోకపోతుండటంతో ఈ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేయటాన్ని కంపెనీ వాయిదా వేసింది.

మహీంద్రా పరిచయం చేసిన వాయిస్ కంట్రోల్ యాక్టివేషన్ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్‌లను ఇవ్వడం ద్వారా వాహనంలో ఆటోమేటిక్‌గా కొన్ని చర్యలు జరుగుతుంటాయి. అంటే.. ఉదాహరణకు హెడ్‌ల్యాంప్స్ ఆన్/ఆఫ్, డోర్స్ లాక్/అన్‌లాక్, వైపర్స్ ఆన్/ఆఫ్, వాల్యూమ్ అప్/డౌన్, ఎఫ్ఎమ్ ఛానెల్ చేంజ్, హజార్డ్ ఆన్/ఆఫ్, బ్లూటూత్ ద్వారా ఫోన్ కాల్స్ వంటి సుమారు 30 కమాండ్లను ఆపరేట్ చేయవచ్చు.

అంతేకాకుండా.. ఇందులో డోర్ సరిగ్గా వేయకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి 15 సేఫ్టీకి సంబంధించి ఏవైనా లోపాలు గుర్తించినా వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఇది డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి ఈ అదనపు ఫీచర్‌ను జోడించినట్లయితే, దీని అమ్మకాలు మరింత పుంజుకునే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 28, 2012, 17:24 [IST]
English summary
According to reports, India's leading SUV maker Mahindra and Mahindra (M and M) is planning to introduce its latest Voice Command Technology in global SUV Mahindra XUV500. This attractive feature is already introduced in new Mahindra Xylo. Voice Command Technology supports vehicle commands like headlamps on/off, doors lock/unlock, wipers on/off, etc with over 30 commands and 15 security warnings. This feature is first ever in the auto industry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+