మహీంద్రా ఎక్స్‌యూవీ500 భేష్.. అయినా లాభాలు మటాష్..

Mahindra Profits
ప్రముఖ యుటిలిచీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నెలతో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్వార్టర్ 3)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.662.15 కోట్లకు పడిపోయి, గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 9.9 శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది.

గడచిన ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ 10 కాలంలో కంపెనీ నికర లాభం రూ.737.38 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,074.5 కోట్ల నుండి రూ.8,327.2 కోట్లకు పెరిగి 37 శాతం వృద్ధిని నమోదు చేసుకుందని, ఇదే సమయంలో ముడిసరుకుల వ్యయం రూ.3,777.4 కోట్ల నుండి రూ.4,579.2 కోట్లకు పెరిగిందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటో, ఫామ్ ఎక్విప్‌మెంట్) పవన్ గోయెంకా తెలిపారు.

రూపాయి విలువ క్షీణత, పెరిగిన ముడిసరుకుల ధరల కారణంగా లాభాలు క్షీణించాయని కంపెనీ పేర్కొంది. ఈ ఫలితాల ప్రభావంతో బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర దాదాపు 3 శాతం క్షీణించి రూ. 689.5 వద్ద ముగిసింది. మహీంద్రా ప్రవేశపెట్టిన కొత్త గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 వల్ల కంపెనీ అమ్మకాలు 30 శాతం మేర వృద్ధి చెందాయని పవన్ తెలిపారు. కాగా.. ఎక్స్‌యూవీ500 కోసం జనవరిలో ప్రారభించిన సెకండ్ ఫేజ్ బుకింగ్‌లలో 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెన పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 8, 2012, 11:54 [IST]
English summary
Mahindra and Mahindra, India's leading SUV manufacturer has reported a 9.9 per cent drop in net profits in Q3 2011-2012. The company has said the sustained increase in raw material costs had affected margins. But it added its margins were still the best in the industry. The company's net profits for Q3 stood at 662.2 crores. Mahindra's net sales for the quarter stood at 8,327 crores marking a 37 per cent increase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+