సెప్టెంబర్ 20న మార్కెట్లోకి రానున్న మహీంద్రా క్వాంటో

రెనో ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సవాల్ చేస్తూ మార్కెట్లో రానున్న మహీంద్రా క్వాంటో (మినీ జైలో) కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఎస్‌యూవీ స్పెషలిష్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రత్యేకించి భారతీయ కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా, పాపులర్ ఎమ్‌పివి జైలో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోను ఈనెల 20న మార్కెట్లో విడుదల చేయనుంది.

హ్యాచ్‌బ్యాక్, ఎమ్‌పివి, ఎస్‌యూవీలతో కలయికతో ఇది తయారు చేయబడింది. మహీంద్రా క్వాంటోను అభివృద్ధి చేసే సమయంలో వివిధ వినియోగదారుల సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని దీనికి రూపకల్పన చేశారు. పవర్, స్పేస్, పెర్ఫామెన్స్‌లతో కూడిన కాంపాక్ట్ కారును కోరుకునే వారికి క్వాంటో బెస్ట్ ఆప్షన్‌గా నిలువనుంది. దీనికితోడు ఇది అత్యంత విశ్వసనీయ బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వస్తుంది కాబట్టి క్వాంటో మార్కెట్లో తిరుగులేని సక్సెస్‌ను సాధించటం ఖాయం.


మహీంద్రా క్వాంటో ధరను అందుబాటులో ఉంచడం కోసం, ఎక్సైజ్ రాయితీలను పొందడానికి గాను దీని పొడవును 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేశారు. మహీంద్రా క్వాంటో పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటీరి స్పేస్ విషయంలో మాత్రం మంచి విశాలమైన స్థలాన్ని కలిగి ఉండనుంది. ఇందులో 7-సీటర్ ఆప్షన్‌ కూడా ఉండనుంది. మూడవ వరుసలో ఎదురెదురుగా ఉండేలా రెండు సీట్లను (రెనో డస్టర్‌లో అమర్చిన మాదిరిగా) అమర్చారు.

మహీంద్రా క్వాంటోలో శక్తివంతమైన 1.5 లీటర్ 100 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.5-6 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న ఎస్‌యూవీలలో కెల్లా క్వాంటోనే అత్యంత చిన్న ఎస్‌యూవీ. సెప్టెంబర్ 20, 2012 (గురువారం)న మహీంద్రా క్వాంటో మార్కెట్లో వాణిజ్యపరంగా విడుదల కానుంది. ఈ బుజ్జి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 8, 2012, 11:34 [IST]
English summary
Mahindra Quanto, the much awaited compact SUV from Mahindra and Mahindra (M and M) is all set to hit the Indian roads. This compact SUV will be launched on the 20th of September. The Quanto is expected to have 7-seater option like Renault Duster.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+