ఫైనాన్స్ సదుపాయం కోసం ఎస్‌బిఐతో దోస్తీ: మహీంద్రా రేవా

ఈ ఒప్పందం ప్రకారం, మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు, ఆన్-రోడ్ ధరపై 85 శాతం వరకూ ఫైనాన్స్‌ను ఎస్‌బిఐ కల్పిస్తుంది. అతితక్కువ వడ్డీ రేటు (12 శాతం) వద్ద 7 ఏళ్ల కాలపరిమితి వరకూ రుణాలను అందిస్తామని ఎస్‌బిఐ ముంబై ఛీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ ఎన్ మెహ్రా తెలిపారు. ఏడేళ్ల కాలపరిమతికి గానూ ప్రతి లక్ష రూపాయాలపై ఈఎమ్ఐ రూ.1765 లుగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ డీల్ ద్వారా డీలర్లు, కస్టమర్ల నుండి మహీంద్రా రేవా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని కంపెనీ ఛీప్ (ఆపరేషన్స్) ఆర్ చంద్రమౌళి వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రీ-పేమెంట్ పెనాల్టీ లేకుండా, రీపేమెంట్ సమయంలో ఎప్పుడైనా రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చని బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మహీంద్రా రేవా అందిస్తున్న 'రేవా ఐ' కారు ధరలు రూ.2.89 లక్షల నుండి రూ.3.52 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.
ప్రస్తుతం మహీంద్రా రేవా "రేవా ఐ" ఎలక్ట్రిక్ కారును మాత్రమే అందిస్తుంది. కాగా.. ఇటీవల ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఓ సరికొత్త ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు "రేవా ఎన్ఎక్స్ఆర్"ను ఆవిష్కరించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది మార్కెట్లోకి వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుంది. ఈ కారు విడుదలైన తర్వాత దీన్ని కూడా ఎస్‌బిఐ బ్యాంకు ద్వారా రుణ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








