ఎక్స్‌యూవీ500 బుకింగ్స్: 2 రోజుల్లో 5,900 యూనిట్లు

బుకింగ్‌లు ప్రారంభమైన రెండు రోజుల్లోనే (జనవరి 25, 2012న ప్రారంభమయ్యాయి) మహీంద్రా ఎక్స్‌యూవీ500కు 5,900 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ వాహనాల డెలివరీలో పారదర్శకతను పాటించేందుకు గానూ బుకింగ్‌లు 7,200 యూనిట్లను దాటినట్లయితే లక్కీడ్రా ప్రాతిపదికన కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని ఎమ్ అండ్ ఎమ్ తెలిపింది.
ఫిబ్రవరి 3 వరకూ కొత్త బుకింగ్స్ తీసుకోనున్నామని, ఈ లక్కీడ్రా ఫలితాలను ఫిబ్రవరి 15న వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. కాగా, గడచిన అక్టోబర్‌లో తొలి విడత బుకింగ్స్‌ను ఐధు ప్రధాన నగరాల్లో ప్రారంభించిప్పుడు, కేవలం 10 రోజుల్లో 8 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్స్‌యూవీ500కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,000 యూనిట్లకు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








