ఓబిసి బ్యాంక్‌తో చేతులు కలిపిన మహీంద్రా అండ్ మహీంద్రా

భారతదేశపు ప్రముఖ ఎస్‌యూవీల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) మరియు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ (ఓబిసి) సంస్థలు చేతులు కలిపాయి. ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న వాహనాలకు ఫైనాన్సింగ్ సేవలు అందించేందుకు గాను ఓబిసితో కంపెనీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 1808 బ్రాంచ్‌ల ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా వినియోగదారులు రుణ సదుపాయాన్ని పొందవచ్చు. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ కస్టమర్ కేర్) అరున్ మల్హోత్రా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ జనరల్ మేనేజర్ అతుల్ గౌతమ్, ఓబిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎల్. బన్సాల్ తదితరుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

మహీంద్రా అండ్ మహీంద్రాకు దేశవ్యాప్తంగా సుమారు 250కు పైగా డీలర్‌షిప్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇటు ఎమ్ అండ్ ఎమ్‌కు అటు ఓబిసికు లబ్ధి చేకూరనుంది. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల ఫైనాన్సింగ్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రాతో చేతులు కలిపామని ఓబిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎల్. బన్సాల్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, August 17, 2012, 17:21 [IST]
English summary
Mahindra & Mahindra Ltd. (M&M), India’s leading SUV manufacturer, today signed a Preferred Financier agreement with Oriental Bank of Commerce (OBC), one of the largest and most reputed public sector banks in the country with 69 years of illustrious banking history.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+