రేవా ఎన్ఎక్స్‌ఆర్ కారును ఆవిష్కరించిన మహీంద్రా
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'రేవా' మరియు ఎమ్ అండ్ ఎమ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫోర్ సీటర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు "రేవా ఎన్ఎక్స్ఆర్"ను మహీంద్రా రేవా 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.
గడచిన 2001లో విడుదలైన రేవా ఎలక్ట్రిక్ కారు "రేవా ఐ" తర్వాత వచ్చిన తొలి అప్‌గ్రేడెడ్ మోడల్ ఇది. మొదటితరం (ఫస్ట్ జనరేషన్) రేవా ఎలక్ట్రిక్ కారు కన్నా ఇది ఎంతో మెరుగైనది. సాధారణ పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే మైలేజ్ విషయంలో రేవా ఎన్ఎఎక్స్ఆర్ కారు తొమ్మిది రెట్లుకు అధికంగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా ఇందులో అధిక మన్నిక గల బ్యాటరీని ఉపయోగించారు.
అంతేకాకుండా బ్యాటరీ పవర్ వృధాగా ఖర్చు కాకుండా ఉండేందుకు దీని గరిష్ట వేగాన్ని నియంత్రించారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై 160 కి.మీ. దూరం వరకూ ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కి.మీ. రేవా ఎన్ఎక్స్ఆర్ కారులో రూ.3 ఖర్చుతో 9.6 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఈ ఏడాది దీపావళి నాటికి రేవా ఎన్ఎక్స్ఆర్ కారు వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









