కొత్త వెరిటో సెడాన్‌ను టెస్ట్ చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా
అప్పటి నుండి మార్కెట్లో వెరిటో అమ్మకాలు జోరందుకున్నాయి. తొలుత టాక్సీ సెగ్మెంట్లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ మోడల్‌ను ప్రస్తుతం ప్యాసింజర్ వాహన సెగ్మెంట్లో కూడా ఉపయోగించటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెరిటో వేగానికి మరింత జోరందించేందుకు గానూ ఇందులో ఓ చవక వేరియంట్‌ను అలాగే ఓ ప్రీమియం వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, కొత్త వెరిటోను అభివృద్ధి చేసి టెస్టింగ్ నిర్వహిస్తోంది.
కొత్త వెరిటోలో ముందువైపు సరికొత్త బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్స్, జైలో లాంటి గ్రిల్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్, వెనుక వైపు రీడిజైన్ చేయబడిన బూట్ లిడ్, రియర్ బంపర్, టెయిల్ ల్యాంప్స్ వంటి బాహ్య మార్పులు (ఎక్స్టీరియర్స్) ఉండనున్నాయి. కొత్త వెరిటో పొడవు నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండనుంది. ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు ఉండనున్నాయి. మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్, త్వరలో మార్కెట్లోకి రానున్న కాంపాక్ట్ టాటా మాంజా సెడాన్‌లకు ఇది పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications









