టాప్-ఎండ్ ఎక్స్‌యూవీ500 ఏడబ్ల్యూడి బుకింగ్స్ రీఓపెన్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500'లో లభిస్తున్న టాప్-ఎండ్ వేరియంట్ 'డబ్ల్యూ8 ఎడబ్ల్యూడి' (ఆల్-వీల్ డ్రైవ్) కోసం కంపెనీ బుకింగ్‌లను పునఃప్రారంభించింది. గతంలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని పలుమార్లు పెంచడంతో ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ 2-3 నెలలకు దిగివచ్చింది.
గతేడాది అక్టోబర్ నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్ ఎండ్ వేరియంట్ కోసం బుకింగ్‌లను స్వీకరించడాన్ని కంపెనీ నిలిపివేసింది. ఇది రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభ్యమవుతుంది. ప్రస్తుతాని టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇకపై ఫోర్-వీల్ డ్రైవ్ (ఆల్-వీల్ డ్రైవ్) ఆప్షన్‌తో కూడిన ఎక్స్‌యూవీ500 బుక్ చేసుకోవాలనుకేవారు మహీంద్రా అధీకృత డీలర్ల వద్ద నుంచి బుక్ చేసుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అమర్చిన 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ఇంతటి అధిక పవర్‌ను కలిగి ఉన్నప్పటికీ, మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా, ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.
ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు:
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 6 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.11.68 లక్షలు
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.13.18 లక్షలు
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ.14.25 లక్షలు


Click it and Unblock the Notifications









