జనవరి 25 నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 బుకింగ్స్ ప్రారంభం

డ్రా ధరఖాస్తు ఫారమ్ కోసం వినియోగదారులు రూ.80,000 లను చెల్లించాల్సి ఉంటుందని, లక్కీడ్రా ఫలితాలను ఫిబ్రవరి 15న వెల్లడిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నయ్యర్ తెలిపారు. కొత్త బుకింగ్‌లను తీసుకునే నగరాల్లో హైదరాబాద్‌తో సహా 19 నగరాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మోడల్‌కు లభిస్తున్న అపూర్వ స్పందనతో బుకింగ్‌లు కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి మించి వస్తుండటంతో గడచిన అక్టోబర్ నెలలో దీని బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్‌యూవీ500లో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








