నేటి నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 బుకింగ్స్ ప్రారంభం

Mahindra XUV500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుండి లభిస్తున్న తొలి గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఎస్‌‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) "మహీంద్రా ఎక్స్‌యూవీ500" బుకింగ్‌లు నేటి నుండి (జనవరి 25, 2012) ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి పది రోజుల పాటు దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఎమ్ అండ్ ఎమ్ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ బుకింగ్‌లను స్వీకరించనుంది.

సాధారణంగా ఏ కంపెనీ అయినా ముందు వచ్చిన బుకింగ్‌లు ముందు డెలివరీ చేయాలనే ప్రతిపాదన మీద బుకింగ్‌లను స్వీకరిస్తాయి. అయితే మహీంద్రా మాత్రం, ముందు వచ్చినా లేక వెనుక వచ్చినా మీ లక్ బాగుంటేనే బుకింగ్ దక్కుతుందని అంటోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉండటం, ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే అనేక మంది క్యూలో ఉండటం వలన కంపెనీ కొద్ది రోజులు మాత్రమే బుకింగ్‌లను తీసుకుంటుంది.

ఈ పది రోజుల్లో రెండవ బ్యాచ్ బుకింగ్స్ గనుక 7,200 యూనిట్లను దాటినట్లయితే లక్కీడ్రా ప్రాతిపదికన కొనుగోలు దారులను ఎంపిక చేస్తామని ఎమ్ అండ్ ఎమ్ ఇదివరకే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ లక్కీ డ్రా ధరఖాస్తు ఫారమ్ కోసం వినియోగదారులు రూ.80,000 లను చెల్లించాల్సి ఉంటుందని, లక్కీడ్రా ఫలితాలను ఫిబ్రవరి 15న వెల్లడిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నయ్యర్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 25, 2012, 11:57 [IST]
English summary
The Mahindra XUV 500 which created a sensation in the SUV market will be back. There were many people who were disappointed when Mahindra closed the bookings of its global SUV within eight days. In a statement to the media Mahindra and Mahindra has stated that it will open the XUV 500’s bookings from January 25th for a limited period of 10 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+