మహీంద్రా ఎక్స్‌యూవీ500 విడుదలై ఏడాది పూర్తి

By Ravi

యుటిలిటీ వాహనాల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) గడచిన సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన గ్లోబల్ మోడల్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఈ నెలతో సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎమ్ అండ్ ఎమ్ రూపొందించిన ఈ ఎస్‌యూవీ అనతి కాలంలోనే, అనూహ్య స్పందనతో అశేష ఆదరణను సొంతం చేసుకొని అనేక ఆటోమొబైల్ అవార్డులను తన ఖాతాలో వేసుకొని విమర్శకుల చేత సైతం ఔరా అనిపించుకుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 హైలైట్స్:

  • కేవలం ఒక్క సంవత్సరంలోనే 35,000 లకు పైగా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు అమ్మడుపోయాయి.
  • పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవటం కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 5,000 యూనిట్లకు పెంచబడింది.
  • హై-ఎండ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎక్స్‌యూవీ500 60 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
  • 2011-12లో 22 అవార్డులను సొంతం చేసుకొని అత్యధికంగా అవార్డులు దక్కించుకున్న కార్/ఎస్‌యూవీగా నిలిచింది.
  • ఇప్పటికీ 14,000 ఎక్స్‌యూవీ500 డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయి.
  • ప్రాంతాన్ని బట్టి వెయింటింగ్ పీరియడ్ 2-3 నెలలుగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి కేవలం ఇండియన్ మార్కెట్ నుంచే కాకుండా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూపర్ మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. కాగా.. ప్రస్తుతం ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడి) మోడల్‌కు బుకింగ్‌లను స్వీకరిస్తున్నామని కంపెనీ ప్రకటించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అమర్చిన 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు:

  • మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 6 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.11.68 లక్షలు
  • మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఫ్రంట్-వీల్ డ్రైవ్) - రూ.13.18 లక్షలు
  • మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ 8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ.14.25 లక్షలు

More from DriveSpark

Article Published On: Tuesday, October 9, 2012, 19:54 [IST]
English summary
Mahindra & Mahindra hasannounced the successful completion of one year of its cheetah-inspired XUV500 model, with 35,000+ vehicles on Indian roads. Launched in end-September 2011, the XUV500 was designed entirely in-house at Mahindra’s world class research and development facility called Mahindra Research Valley at Chennai, and has, since launch, set a benchmark of its own.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+