యూట్యూబ్‌లో 20 లక్షల మంది వీక్షించిన వీడియో!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' కోసం కంపెనీ రూపొందించిన టెలివిజన్ వాణిజ్య ప్రకటన ఇంటర్నెట్‌లో భారీ హల్ చల్ చేస్తోంది. క్యారెట్స్ థీమ్ నేపథ్యంలో ముగ్గురు అందమైన అమ్మాయిలతో రూపొందించిన ఎక్స్‌యూవీ500 కమర్షియల్ యాడ్‌ను యూట్యూబ్‌లో ఇప్పటికే 20 లక్షల మందికిపైగా వీక్షించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 లుక్స్ పరంగా క్యూట్‌గా ఉండి చూపరులను కట్టపడేస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 కోసం రూపొందించిన ఈ వాణిజ్య ప్రకటనను తొలుత విడుదల చేసినప్పుడు విమర్శలు వచ్చినప్పటికీ మార్కెట్లో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఇప్పటికే ఫేస్‌బుక్‌లో సుమారు 3 లక్షల అభిమానులను సొంతం చేసుకుంది.

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే, ఇది డబ్ల్యూ6, డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 2179సీసీ ఎమ్‌హాక్ డైరెక్ట్ ఇంజెక్షన్ డీజిల్ ఇంజన్ 3750 ఆర్‌పిఎమ్ వద్ద 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1600-2800 ఆర్‌పిఎమ్ వద్ద 330 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* డబ్ల్యూ6 - రూ. 11.1 లక్షలు
* డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) - రూ. 12.45 లక్షలు
* డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) - రూ. 13.43 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, February 29, 2012, 16:51 [IST]
English summary
Mahindra XUV 500 advertisement hit on You Tube. Mahindra new commercial for the "cheetah inspired" Mahindra XUV ad get 2 million visits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+