2 రోజుల్లో 7,200 బుకింగ్‌లను దక్కించుకున్న ఎక్స్‌యూవీ500

ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న మ్యాజిక్ గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" ఎప్పటిలాగే మార్కెట్లో చిచ్చరపిడుగులా దూసుకుపోతుంది. కంపెనీ తాజా జూన్ 8వ తేదీ నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుకింగ్‌లు ప్రారంభమైన రెండు రోజుల్లోనే 7,200 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయిన కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్‌కు, దాని సప్లయ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇందుకు ప్రధాన కారణం సదరు ఎస్‌యూవీ ఉత్పత్తి తక్కువగా ఉండటమే. అందుకే ఈ మోడల్ వెయింటింగ్ పీరియడ్ కూడా అధికంగానే ఉంటుంది. అయితే, కొనుగోలుదారులు మాత్రం తమ మనసు మార్చుకోకుండా, ఎన్నాళ్లైనా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తామని చెబుతున్నారు. అత్యంత ఆకర్షనీయమైన ధరలో ఓ వరల్డ్ క్లాస్ లుక్ అండ్ ఫీల్, ఫీచర్లు కలిగిన ఎస్‌యూవీ లభిస్తుంటే ఫ్లాట్ అవ్వని కార్ లవర్స్ ఎవరుంటారు చెప్పండి.


ఏదేమైనప్పటికీ, మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 5,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఇది సాధ్యం కానుంది. ప్రపంచ స్థాయి ఫీచర్లతో అభివృద్ధిచేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది.

ఇందులో అమర్చిన 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు రూ.11.58 లక్షల నుంచి రూ.14.11 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి. ఇంకా ఇందులో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 13, 2012, 10:25 [IST]
English summary
Mahindra had reopened bookings of its best selling cheetah-inspired XUV500 from June 8 and the carmaker has now registered an even huge bookings of 7,200 units in just two days. The XUV 500 has been seeing overwhelming response with the SUV's 9 months' production capacity being sold out in just 2 rounds of booking.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+