ఫిబ్రవరిలో అయినా మహీంద్రా మినీ జైలో విడుదలయ్యేనా..?

అదే విధంగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గానూ జైలోలో ఓ స్మాలర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్త ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా మినీ జైలో ఈ నెలలోనే అంటే, ఫిబ్రవరి 8వ తేదీనా మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మినీ ఎమ్‌యూవీ టెస్ట్ రన్‌కు సంబంధించి ఇప్పటికే అనేక స్పైషాట్స్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా జైలో ఎమ్‌యూవీని ప్రవేశపెట్టిన సమయంలో ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా ఇది కార్ ఆఫ్ ది ఇయర్, ఎమ్‌యూవీ ఆఫ్ ది ఇయర్ వంటి పలు ఆటోమొబైల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాతి కాలంలో జైలోకు పోటీగా వివిధ మోడళ్లు మార్కెట్లోకి రావడంతో దీని అమ్మకాలు మందగించాయి.
ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్లోకి రానున్న మినీ జైలోపై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. మినీ జైలోలో ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ పరంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాంకేతికంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, మినీ జైలోలో కంపెనీ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మరో వారం రోజుల్లో పూర్తి విషయం బయటపడనుంది.


Click it and Unblock the Notifications








