తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన మారుతి; మార్కెట్ వాటా కైవసం
అయితే, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిపోయినట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించిన మారుతి సుజుకి మెల్లిగా తాను కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి నుండి అమ్ముడువుతున్న టాప్ 3 కార్ బ్రాండ్లు (ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్ఆర్) కంపెనీకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసిన తర్వాత కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి. అమ్మకాల్లో రెండో స్థానంలో ఉన్న వ్యాగన్ఆర్‌ను వెనక్కు నెట్టి కొత్త స్విఫ్ట్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది.
మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతూ పెట్రోల్ కార్లకు డిమాండ్ తగ్గుతూ వస్తున్నా కూడా, ఇప్పటికీ ఆల్టో కారే లీడర్‌గా ఉందని, కానీ వ్యాగన్ఆర్‌లో డీజిల్ వేరియంట్ లేకపోవటం వలన అమ్మకాలు తగ్గాయని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. 2010-11లో 45 శాతంగా ఉన్న మారుతి సుజుకి మార్కెట్ వాటా, అక్టోబర్ 2011లో ఏకంగా 28 శాతానికి పడిపోయింది. కాగా.. గడచిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో కంపెనీ మార్కెట్ వాటా దాదాపు 40 శాతానికి చేరుకుంది. మొత్తమ్మీద గాడి తప్పిన మారుతి సుజుకి మార్కెట్ వాటా ఎట్టకేలకు మళ్లీ పట్టాల మీదకు వచ్చింది.


Click it and Unblock the Notifications









