మరిన్ని డీజిల్ కార్లను తీసుకురానున్న మారుతి సుజుకి

మానేసర్ గొడవలతో భారీ షాక్ తిన్న మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ), ఆటోమొబైల్ మార్కెట్లో కోల్పోతున్న తన మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం డీజిల్ కార్లకు డిమాండ్ జోరుగా ఉన్న నేపథ్యంలో, మరింత అధిక సంఖ్యలో డీజిల్ కార్లను తయారు చేసే అంశపై కంపెనీ దృష్టి సారిస్తోంది. కార్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలంటే మరిన్ని డీజిల్ కార్లను, ఇంజిన్లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్ఎస్ఐ చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న కార్లలో సుమారు 80 శాతం డీజిల్ కార్లే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము పెట్రోల్ కార్లకే పరిమితం కాలేమని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి మార్కెట్ షేర్ 38.61 శాతంగా నమోదైంది. 2014 నాటికి 7 లక్షల డీజిల్ ఇంజిన్లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఒకవేళ డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయకుండా, ఇంధన ధరల విధానం ప్రస్తుతం అమల్లో ఉన్నట్లుగానే ఉన్నట్లయితే, వీటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల మద్య వ్యత్యాసం అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను వదిలిపెట్టి కాస్తంత ధర అధికమైనప్పటికీ డీజిల్ కార్లనే కొనుగోలు చేస్తున్నారు.

మారుతి సుజుకి అందిస్తున్న పవర్‌ఫుల్ ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌లో సిఎన్‌జి వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. కాగా.. మానేసర్ ప్లాంటులో జరిగిన అల్లర్లపై భార్గవ మాట్లాడుతూ.. ఇది ముందస్తు వ్యూహంతోనేజరిగిందని, భారత పారిశ్రామిక సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. అయినప్పటికీ, మానేసర్ ప్రాంతం నుంచి తాము తొలగిపోయే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఈ హింసాకాండలో ప్రాణాలుకోల్పోయిన కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) అవనిష్ మృతి పట్ల కంపెనీ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ప్లాంటులో 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 29, 2012, 13:23 [IST]
English summary
Maruti Suzuki India said it is "examining" having more diesel engine capacity than it has currently planned in order to have an overall 40 per cent market share in the domestic passenger vehicle market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+