ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్ డిజైర్ విడుదల: మారుతి సుజుకి

కొత్త స్విఫ్ట్ డిజైర్ గురించి మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ మాట్లాడుతూ.. "మేము కొత్త డిజైర్‌పై భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాం. ఇదొక సరికొత్త ఫ్లాట్‌ఫామ్. ప్రస్తుతం లభిస్తున్న డిజైర్‌తో పోల్చుకుంటే కొత్త డిజైర్‌లో కనీసం 150 కొత్త ఫీచర్లు ఉంటాయి. ఇది తక్కువ ధరకే లభించనున్న సరికొత్త కారు" అని అన్నారు.
కొత్త స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 1.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్ కూడా లభించనుంది. మోడల్ మార్పు కోసం కంపెనీ, దాని వెండర్లు రూ.230 కోట్లకు పైగా పెట్టుబడిని వెచ్చించామని పారీక్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








