స్విఫ్ట్ స్పోర్ట్‌ను ఇండియాకు తీసుకురానున్న మారుతి సుజుకి

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సంగతి తెలిసిందే. వెయిటింగ్ పీరియడ్ అధికంగాన్న ఉన్నప్పటికీ, కస్టమర్లు ఇదే ఈ మోడల్‌ను బుక్ చేసుకుంటున్నారంటే, స్విఫ్ట్ కారుపై కస్టమర్లకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఇంతటి క్రేజ్‌ను సంపాధించుకున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే మరో కొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చేందుకు ముస్తాబవుతుంది.

కొత్త స్విఫ్ట్ ఇటు ఫ్యామిలీ కస్టమర్లను అటు యువతను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. స్విఫ్ట్ ఓ స్పోర్ట్ కారు ఫీల్‌ను ఇస్తుంది కాబట్టి యువత ఎక్కువగా ఈ కారు పట్ల ఆకర్షితమవుతుంది. అందుకే ప్రధానంగా యువ కస్టమర్లను టార్గెట్ చేస్తూ మూడు డోర్లు (రెండు సైడ్ డోర్లు, ఒక వెనుక డోర్), నాలుగు సీట్లు కలిగిన "స్విఫ్ట్ స్పోర్ట్" మోడల్‌ను ఇండియాకు తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ మోడల్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో లభ్యమవుతుంది.


వాస్తవానికి కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త స్విఫ్ట్‌ డిజైన్‌ను స్విఫ్ట్ స్పోర్ట్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించటం జరిగింది. ఈ స్విఫ్ట్‌ స్పోర్ట్‌లో పెద్ద ఫాగ్ ల్యాంప్స్, శక్తివంతమైన హెడ్‌ల్యాంప్స్, మెటాలిక్ గ్రే కోటింగ్, తక్కువ బరువు కలిగిన పెద్ద 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సరికొత్త గ్రిల్, ఆకర్షనీయమైన ఏరోడైనమిక్స్‌ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ఇందులో స్పోర్టీ సీట్స్, ఫైవ్-డయల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌తో పాటుగా మరెన్నో అత్యాధునిక మరియు అదనపు ఫీచర్లను జోడించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఇంజన్ పెర్ఫామెన్స్. కొత్త స్విఫ్ట్ స్పోర్ట్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ డిఓహెచ్‌సి ఇంజన్ 134 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ కర్భన వ్యర్థాలు విడుదల చేస్తుంది. ఏదేమైనప్పటికీ, ఈ కొత్త స్విఫ్ట్ స్పోర్ట్ మార్కెట్లోకి వస్తే.. ఇక మారుతికి తిరుగు ఉండదని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, May 5, 2012, 12:46 [IST]
English summary
The Swift is undoubtedly Maruti Suzuki's best product in recent years. Indian drivers have liked it for its performance, handling and practicality and they can now enjoy its power too if Maruti Suzuki does what many are hoping it will do.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+