ఏప్రిల్ 11న మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి ఎర్టిగా

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తొలిసారిగా భారతీయుల కోసం తయారు చేసిన బహుళ ప్రయోజన వాహన (ఎమ్‌పివి) "ఎర్టిగా"ను వచ్చే నెల 11వ తేదీన వాణిజ్యపరంగా మార్కెట్లో విడుదల చేయనుంది. యూనియన్ బడ్జెట్ 2012-13 విడుదైలన తర్వాతనే మారుతి సుజుకి తమ సరికొత్త ఎమ్‌పివిని మార్కెట్లోకి తీసుకురానుందని గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానున్న మారుతి సుజుకి ఎర్టిగాలో నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను, 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్‌లను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 70 కి.వా. గరిష్ట శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే డీజిల్ వేరియంట్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 66 కి.వా. గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

పెట్రోల్ వేరియంట్‌ ఎర్టిగా లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. ఇంకా ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబిల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్, ట్విన్ ఏసి, ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కాంపాటిబల్, 4+2 స్పీకర్స్), స్టీరింగ్‌పై ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) ఆడియో కంట్రోల్స్, సెంట్రల్ డోర్ లాకింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, March 10, 2012, 11:50 [IST]
English summary
The country's largest car maker Maruti Suzuki India (MSI) has announced the the launch date for its first multipurpose vehicle (MPV) Ertiga. Maruti Suzuki will commercially launch this all new MPV on April 11, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+