మారుతి ఎర్టిగా, చెవర్లే ఎంజాయ్‌లకు పోటీగా టొయోటా అవాంజా

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి రాకతో ఈ సెగ్మెంట్లో వేడి రాజేసుకుంది. ఈ కొత్త మోడల్ రాకతో ఎమ్‌పివి సెగ్మెంట్లో ఇప్పటివరకూ కింగ్‌లా ఉన్న టొయోటా ఇన్నోవాకు పెద్ద తలనొప్పే కలుగుతోంది. అయితే, సౌకర్యవంతమైన, పవర్‌ఫుల్ ఎమ్‌పివి కోరుకునే వారు మాత్రం టొయోటా ఇన్నోవాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మైలేజ్, ధర, మెయింటినెన్స్, బ్రాండ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే వారు మాత్రం మారుతి సుజుకి ఎర్టిగా వైపుకు మళ్లుతున్నారు.

ఏదేమైనప్పటికీ, ఈ సెగ్మెంట్లో కొత్తగా రానున్న చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి, హోండా ఎమ్‌పివి (ఫ్రీడ్)ల నుంచి ఎదురు కానున్న పోటీని మరియు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే టొయోటా చవక ధర కలిగిన ఎమ్‌పివిని విడుదల చేయాల్సింది. ప్రస్తుతం టొయోటా యూరోపియన్ మార్కెట్ల కోసం తయారు చేస్తున్న ఎమ్‌పివి 'టొయోటా అవాంజా' (Toyota Avanza)ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


టొయోటా అవాంజా ఎమ్‌పివి చూడటానికి అచ్చం టొయోటా ఇన్నోవా మాదిరిగా ఉంటుంది. అయితే, ఇది టొయోటా ఇన్నోవా కాస్తంత పొడవు తక్కువగా ఉంటుంది. టొయోటా అవాంజా ఖర్చును తగ్గించేందుకు గానూ దీనిని టొయోటా ఎతియోస్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. సుమారు రూ.7 లక్షల ధర రేంజ్‌లో అందుబాటులోకి రానున్న టొయోటా అవాంజా కాంపాక్ట్ ఎమ్‌పివి సెగ్మెంట్లో ఇతర పోటీదారుల కన్నా ముందు నిలబటం ఖాయమని తెలుస్తోంది.

ఇదే కాకుండా, టొయోటా మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా కొత్త మోడళ్ల రాకతో పోటీ జోరందుకున్న తరుణంలో తక్కువ ధర కలిగిన నెక్స్ట్-జనరేషన్ టొయోటా రష్ ఎస్‌యూవీని కూడా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ఫోర్డ్ నుంచి రానున్న ఎకో‌స్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రానున్న నెక్స్ట్-జనరేషన్ స్కార్పియో మోడళ్లకు ధీటుగా టొయోటా రష్ నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 10, 2012, 10:24 [IST]
English summary
According recent reports, Toyata Kirloskar Motors (TKM) is planning expand its product portfolio in Indian market. It is speculated that TKM will bring in its compact multi purpose vehicle (MPV) Avanza to India. Toyata Avanza will compete with Maruti Suzuki Ertiga, upcoming Chevrolet Enjoy MPVs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+