కొత్త డిజైర్‌పై కోటి ఆశలు పెట్టుకున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) తాజాగా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ బుజ్జి సెడాన్‌తో ఎంట్రీ-లెవల్ మార్కెట్లో అధిక మార్కెట్ వాటాను చేజిక్కించుకోగలమని మారుతి అంచనా వేస్తోంది. పాత స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కన్నా దాదాపు రూ.25,000 నుండి రూ.30,000 వరకూ తక్కువ ధరతో ఇటు పెట్రోల్, అటు డీజిల్ వేరియంట్లలో కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్‌ను ఎమ్ఎస్ఐ ప్రవేశపెట్టి ఈ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి కంపెనీ తెరలేపింది.

కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 సెడాన్ ఫోటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

నగరాల్లో నివసించే యువ కుటుంబాల ప్రశంసలు అందుకునే విధంగా కొత్త స్విఫ్ట్ డిజైర్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా అనేక ఆసక్తికరమైన మార్పులను తమ ఇంజనీర్లు తీసుకువచ్చారని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి తెలిపారు. ఎంట్రీ లెవల్ సెడాన్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న డిజైర్ నెలకు 8,000-9,000 యూనిట్ల వరకూ అమ్ముడవుతుంది. ఈ సెగ్మెంట్లో అత్యంత పోటీతో కూడిన ధరతో (రూ.5 లక్షలకు దిగువన) టొయోటా ఎతియోస్ రావడంతో ఎమ్ఎస్ఐ స్విఫ్ట్ డిజైర్‌కు మార్పులు చేర్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.

కొత్త 2012 స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పెట్రోల్ వేరియంట్ 2012 స్విఫ్ట్ డిజైర్ ధరలు:
* 2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ: రూ. 4.79 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ: రూ. 5.32 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ (ఆటోమేటిక్): రూ. 6.54 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ: రూ. 6.19 లక్షలు

డీజిల్ల్ వేరియంట్ 2012 స్విఫ్ట్ డిజైర్ ధరలు:
* 2012 స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐ: రూ. 5.80 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ విడిఐ: రూ. 6.31 లక్షలు
* 2012 స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ: రూ. 7.09 లక్షలు

అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ.

More from DriveSpark

Article Published On: Thursday, February 23, 2012, 18:15 [IST]
English summary
Maruti Suzuki India (MSI) is expecting higher market share in the entry-level sedan market through its recently launched Compact Swift Dzire. "Our engineers have brought in interesting modifications including an Automatic Transmission in the new Swift Dzire to meet the aspirations of a young city family," Maruti MD Shinzo Nakanishi said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+