మరోసారి స్విఫ్ట్ డిజైర్ ధరలను పెంచిన మారుతి సుజుకి
ఇటీవల మారుతి సుజుకి విడుదల చేసిన స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గడచిన ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి కేవలం రూ.4.79 లక్షల ప్రారంభ ధరకే కాంపాక్ట్ స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. యూనియన్ బడ్జెట్ విడుదలైన తర్వాత మారుతి సుజుకి అన్ని ఉత్పత్తుల ధరలను పెంచగా, తాజా మరోసారి స్విఫ్ట్ డిజైర్ ధరలను మోడల్‌ను బట్టి రూ.8,000 నుండి రూ.12,000 మేర పెంచతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఈ పెంపు కేవలం డీజిల్ వేరియంట్లకు మాత్రమే వర్తించనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గి డీజిల్ కార్ల అమ్మకాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ మోడళ్ల ధరలను పెంచటం గమనార్హం. పెరిగిన కొత్త ధరలు మే 1, 2012 నుండి అమలులోకి వస్తాయని మారుతి సుజుకి పేర్కొంది. ఆల్టో, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల తర్వాత మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడువుతున్న మోడల్ స్విఫ్ట్ డిజైర్.
కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ, వివిటిఐ టెక్నాలజీతో కూడిన కె12 ఎమ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 85.8 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని 114 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటర్ పెట్రోల్‌కు 19.1 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది కేవలం 12.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (విఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే)తో లభిస్తుంది.
కొత్త స్విఫ్ట్ డిజైర్ 2012 డీజిల్ వేరియంట్‌లో 1.3 లీటర్ డిడిఐఎస్ సిఆర్‌డిఐ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 74 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని 190 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటర్ డీజిల్‌కు 23.4 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇది కేవలం 14.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో మాత్రమే లభిస్తుంది.


Click it and Unblock the Notifications









