అదే ధర కానీ అధనపు ఫీచర్లు: స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ ఆల్ఫా

మారుతి సుజుకి ఇండియా అత్యధికంగా అమ్ముడువున్న హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు (సోమవారం) మార్కెట్లో విడుదల చేసింది. 'స్విఫ్ట్ ఆల్ఫా' పేరుతో మారుతి సుజుకి విడుదల చేసిన ఈ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్‌‌లో స్విఫ్ట్ విఎక్స్-ఐ వేరియంట్లో లభించే ఫీచర్లతో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మారుతి సుజుకి నుండి అమ్ముడవుతున్న మొత్తం కార్లలో పెట్రోల్ మోడళ్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ అదనపు ఫీచర్లు కలిగిన కొత్త స్విఫ్ట్ ఆల్ఫా పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేయటం గమనార్హం. ఈ అప్‌గ్రేడెడ్ స్విఫ్ట్ ఆల్ఫా కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. కస్టమర్ల నుండి ఎలాంటి అదనపు డబ్బులను వసూలు చేయకుండాన్ ఈ అదనపు ఫీచర్లను జోడించిన వేరియంట్‌ను కంపెనీ అందిస్తోంది.

మారుతి సుజుకి తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే, పడిపోతున్న పెట్రోల్ కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ చేస్తున్న ఓ మార్కెటింగ్ ప్రయత్నంగా తెలుస్తోంది.

మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ ఆల్ఫా స్పెషల్ ఎడిషన్ వేరియంట్లో లభించే ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

* ఇంటీరియర్ స్టయిల్ కిట్
* బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మ్యూజిక్ సిస్టమ్
* స్పీకర్లు
* డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్
* డోర్-సిల్ గార్డ్స్
* డోర్ విజర్స్
* బాడీ కలర్ రియర్ రూఫ్ స్పాయిలర్
* మడ్-ఫ్లాప్స్
* సీట్ కవర్స్

కస్టమర్లు ఈ అదనపు ఫీచర్లను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.8,000 వరకూ ఖర్చు అవుతుందని, అయితే వీటిని తాము ఎలాంటి అధనపు చార్జీలు వసూలు చేయకుండానే అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, April 16, 2012, 19:03 [IST]
English summary
Maruti Suzuki has launched a new special edition model of the Swift hatchback. Maruti Swift Alpha Limited Edition will come only in the mid-level Maruti Swift VXi petrol variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+