మారుతి మానేసర్ ప్లాంట్ లాకౌట్: రోజుకు రూ.90 కోట్ల నష్టం
అంతేకాకుండా, ఈ ప్లాంట్‌పై ఆధారపడి ఉన్న ఇతర చిన్న చిన్న కంపెనీలు, విడిభాగాల సప్లయర్లు కూడా పెద్ద ఎత్తునే నష్టపోతున్నారు. మానేసర్ ప్లాంటును నమ్ముకొని అనేక విడిభాగాల కంపెనీలు మానేసర్-గుర్గావ్ ప్రాంతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో ఈ చిన్న చిన్న కంపెనీలు కూడా భారీగా నష్టపోతున్నాయి.
గడచిన నెల మూడవ వారంలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులోని కార్మికులు, కంపెనీ యాజమాన్యంతో గొడవకు ప్లాంటులో పెద్దఎత్తున విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ గొడవల్లో కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) అవనిష్ కుమార్ దేవ్ ప్రాణాలు కోల్పోగా, పలువురు కంపెనీ సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో మారుతి సుజుకి యాజమాన్యం జులై 21 నుంచి మానేసర్ ఫ్యాక్టరీ లాకౌట్‌ను ప్రకటించింది.
ఇదిలా ఉండగా, మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో త్వరలోనే ఉత్పత్తి పనులు ప్రారంభమవుతాయని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్‌సింగ్ హుడా ఇది వరకే ప్రకటించారు. ఈ ప్రాంతంలో తరచూ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో, మారుతి సుజుకి మానేసర్ నుంచి తప్పుకోనుందనే వార్తలను ఆయన ఖండించారు. కంపెనీ తమ రాష్ట్రాన్ని వదిలిపెట్టే వెళ్లదని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications









