మారుతి సుజుకి ఇండియాకు మరో కొత్త తలనొప్పి
హర్యానా కార్మిక విభాగం నుండి ఎమ్ఎస్‌డబ్ల్యూయూ గుర్తింపు లభించిన మరుసటి రోజే 15 రోజుల్లోగా వేతనాలను సవరించాలని సదరు యూనియన్ మారుతి సుజుకి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. గతంలో ఉన్న కార్మిక సంఘం "మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్" నేతలకు కంపెనీ భారీ మొత్తంలో ప్యాకేజీలు అప్పజెప్పి చేతులు దులుపుకుంది. దీంతో తమ కొత్త యూనియన్ ఏర్పాటుకు మానేసర్ కార్మికులకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం తమ కొత్త యూనియన్‌కు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందని, మానేసర్ ప్లాంటులో ఉన్న అన్ని సమస్యలనూ చర్చిస్తున్నామని, ఇందులో భాగంగానే తొలుత వేతనాలను సవరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చామని మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ కారదర్శి సరబ్‌జీత్ సింగ్ తెలిపారు. ఈ విషయం గురించి మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ ప్రస్తావిస్తూ.. కొత్త యూనియన్‌ను తాము గుర్తించామని, ఈ యూనియన్‌కు రిజిస్ట్రేషన్ సంఖ్య రావడంలో తాము కూడా సహకరించామని, ఈ వేతన వేతన సమస్యను మానవ వనరుల (హెచ్‌ఆర్) విభాగం పరిశీలిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications









