పాత డిజైర్‌ను టాక్సీ స్పెషల్‌గా ప్రవేశపెట్టిన మారుతి సుజుకి
ఈ నేపథ్యంలో మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న పాత తరం (ఓల్డ్ జనరేషన్) స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేయడం ఇష్టం లేని మారుతి సుజుకి, ఈ మోడల్ పేరును మార్చి "స్విఫ్ట్ డిజైర్ టూర్" అనే పేరుతో టాక్సీ స్పెషల్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోల్ (ఎల్ఎక్స్ఐ) మరియు డీజిల్ (ఎల్‌డిఐ) వేరియంట్లలో లభ్యం కానున్న స్విఫ్ట్ డిజైర్ టూర్ కేవలం బేస్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.
టాక్సీ స్పెషల్ డిజైర్ సెడాన్‌లో ఏసి, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఓవిఆర్ఎమ్ (సైడ్ మిర్రర్స్), బ్లాక్ డోర్ హ్యాండిల్స్ వంటి స్టాండర్డ్ ఫీచర్లతో లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ టూర్ సెడాన్ ధర రూ.5.91 లక్షలకు, పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ టూర్ ధర రూ.4.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గాను ఉంది. స్విఫ్ట్ డిజైర్ టూర్ సెడాన్ ఏప్రిల్ 2012 నుండి మార్కెట్లో లభ్యం కానుంది. దీనిని కేవలం టాక్సీ, వాణిజ్య కార్యకలాపాల కోసం మాత్రమే విక్రయించనున్నారు.
స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మెయింటినెన్స్ ఖర్చు తక్కువగా ఉండి, అధిక మైలేజ్‌ను ఇవ్వటం కారణంగా ఎక్కువ సంఖ్యలో వీటిని ప్యాసింజర్ క్యాబ్‌లుగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, దీని విశాలమైన బూట్ స్పేస్ (400 లీటర్లకు పైగా), విస్తృతస్థాయిలో ఉన్న మారుతి సుజుకి సర్వీసింగ్ నెట్‌వర్క్ వంటి పలు ప్రధాణ కారణాల వల్ల కొనుగోలుదారులు దీనిని టాక్సీగా ఉపయోగిస్తున్నారు. స్విఫ్ట్ డిజైర్ టూర్ ఈ సెగ్మెంట్లోని మహీంద్రా లోగాన్, టాటా ఇండిగో సిఎస్ వంటి ఎంట్రీ లెవల్ టాక్సీ సెడాన్‌లకు మంచి పోటీ ఇవ్వనుంది. ఈ సెగ్మెంట్లో ఇతర మోడళ్ల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
స్విఫ్ట్ డిజైర్ టూర్ - రూ.5.91 లక్షలు (పెట్రోల్); రూ.4.88 లక్షలు (డీజిల్)
టాటా ఇండిగో ఎక్స్ఎల్ - రూ.5.91 లక్షలు (పెట్రోల్); రూ.6.29 లక్షలు (డీజిల్)
టొయోటా ఎతియోస్ - రూ.6.69 లక్షలు (పెట్రోల్); రూ.5.14 లక్షలు (డీజిల్)
మహీంద్రా వెరిటో - రూ.5.97 లక్షలు (పెట్రోల్); రూ.5.04 లక్షలు (డీజిల్)


Click it and Unblock the Notifications









