భారీ భద్రతతో మానేసర్ ప్లాంట్‌ను రీఓపెన్ చేయనున్న మారుతి

ప్రస్తుతం లాకౌట్‌లో ఉన్న మారుతి సుజుకి మానేసర్ ప్లాంటును తిరిగి ప్రారంభించినప్పటికీ, ఈ ప్లాంట్ చుట్టూ భద్రతా బలగాలు మోహరించనున్నాయి. హర్యానాలోని మానేసర్‌లో ఉత్పత్తిని పునఃప్రారంభించే విషయంపై కంపెనీ ఓ ఖచ్చితమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని, అయితే, పూర్తి రక్షణ, సాయుధ బలగాల కాపలాతోనే ప్లాంటును తిరిగి ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది.

ఇందుకు హర్యానా ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంటులో మరోసారి ఇదివరకటి లాంటి అల్లర్లు జరగకుండా ఉండేలా చూసుకునేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటామని హర్యానా సర్కారు హామీ ఇచ్చింది. మానేసర్‌ ప్లాంటును తిరిగి ప్రారంభించాలంటే, పోలీసుల సహకారం తప్పనిసరని కంపెనీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మారుతి సుజుకి యాజమాన్యం నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు కంపెనీ బోర్డు డైరెక్టర్లు హర్యానా ప్రభుత్వానికి ఓ లేఖను రాసినట్లు సమాచారం.

గత నెల మూడవ వారంలో మానేసర్ ప్లాంటులో చోటు చేసుకున్న అల్లర్లలో సుమారు 100 మందికి పైగా కార్మికులకు సంబంధం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ అల్లర్ల కారణంగా మానేసర్ ప్లాంటులో భారీగా ఆస్తి నష్టం జరగటమే కాకుండా, కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మరణానికి కూడా దారి తీసింది. అంతేకాకుండా, ఈ గొడవల్లో అనేక మంది కంపెనీ సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు.

మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో మొత్తం 3000 మంది శాశ్వత ఉద్యోగులు, 2,800 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంటును పునఃప్రారంభించాలని కంపెనీ నిర్ణయిస్తే, ఈ ప్లాంట్ చుట్టూ భద్రతా బలగాలను మోహరింపచేయాలని హర్యానా ప్రభుత్వం సైతం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిల్‌ కుమార్‌ వివరించారు. ఇదిలా ఉండగా, మానేసర్ ప్లాంట్ మూతపడిన కారణంగా, ఈ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పోటీదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 14, 2012, 13:41 [IST]
English summary
Maruti Suzuki, which will take a decision on reopening of its Manesar plant on Monday, will operate the violence-hit facility under police protection on resumption of production with the Haryana government not willing to take a chance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+