మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
ప్రస్తుతం ప్లాంటులో 1,500 మందికి పైగా పర్మినెంట్ వర్కర్లు పనిచేస్తున్నారు. కాగా.. గత బుధవారంలో అల్లర్లలో పాల్గొని, విధ్వంసానికి పాల్పడిన ఉద్యోగులందరినీ డిస్మిస్ చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. వీరిని ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. కార్మికులు ఇంత ఘాతుకానికి పాల్పడుతారని మారుతి సుజుకి యాజమాన్యం కూడా ఎన్నడూ ఊహించలేదు. ఈ అనూహ్యా సంఘటనతో దిగ్భ్రాంతి చెందిన కంపెనీ యాజమాన్యం అల్లర్లకు పాల్పడిన కార్మికుల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి వచ్చే విషయం లేదని అంటోంది.
తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా కార్మికుల క్షణికావేశమే వారి జీవనాధరంపై దెబ్బకొట్టింది. ఇలాంటి కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటే, ఇతర ఉద్యోగులు, ఉన్నతాధికారు, కంపెనీ ఆస్తులకు ప్రమాదమని, వీరి విషయంలో ఎలాంటి ఉపేక్షనీయతను ప్రదర్శించే అవకాశం లేదని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం మానేసర్ ప్లాంటు లాకౌట్‌లో ఉంది. ఈ ప్లాంటులో స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ వంటి కార్లు (ఎక్కువగా డీజిల్ కార్లు) ఉత్పత్తి అవుతాయి.


Click it and Unblock the Notifications









