మారుతి మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి బంద్; కార్మికుల అరెస్ట్
ఈ కేసులో పోలీసులు 91 మంది కార్మికులను అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. వీరందరిపై ఆయుధాల వినియోగం, హత్య, హత్యాయత్నం, చట్టవ్యతిరేక సమావేశం, కొట్లాట వంటి వివిధ కేసులను బుక్ చేశారు. స్తుతం మానేసర్ ప్లాంటు పూర్తిగా పోలీసుల స్వాధీనంలో ఉంది. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు మానేసర్ ప్లాంటు పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఫ్యాక్టరీ లాకవుట్ పరిస్థితులను ఎదుర్కునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఓ వర్కర్‌ను కులం పేరు పెట్టి దూషించి, అతనిపై చేయి చేసుకోవటమే కాకుండా, సస్పెండ్ కూడా చేయడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో కార్మికులు అనేక మంది కంపెనీ ప్రతినిధులు, మేనేజర్లు సూపర్‌వైజర్లపై దాడికి దిగారు. ఆఫీసు భవంతులు, సెక్యూరిటీ కార్యాలయాలు, ఫైర్ సేఫ్టీ విభాగాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం, పోలీసులు హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications









