బ్రేకింగ్ న్యూస్: కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 బుకింగ్స్ ఓపెన్
చిన్న కార్ సెగ్మెంట్లో సునామీ సృష్టించేందుకు దేశపు అగ్రగామి కార్ కంపెనీ సిద్ధం చేసిన సరికొత్త ఆల్టో 800 కారు విడుదలకు ముస్తాబవుతోంది. వీలైనంత త్వరగా ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారి కోసమే ఈ లక్కీ అవకాశం. మరికొద్ది రోజుల్లో మార్కెట్లో సందడి చేయనున్న కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు కోసం కంపెనీ ఇప్పటి నుంచే ముందస్తు బుకింగ్‌లను అంగీకరించడాన్ని ప్రారంభించింది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త కారు వచ్చే నెల 16న (అక్టోబర్ 16, 2012) మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ నేపథ్యంలో, కొత్త ఆల్టో 800 కోసం కంపెనీ బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారును బుక్ చేసుకోవాలంటే, ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://www.marutisuzukialto800.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవటమే.
కొత్త ఆల్టో 800 వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకువస్తామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందులో సిఎన్‌జి వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నామని మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెట్ విభాగం) మనోహర్ భట్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్త ఆల్టో కారును డిజైన్ చేయటం కోసం కంపెనీ రూ.470 కోట్లను వెచ్చించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఆల్టో డిజైన్‌ను ఆధారంగా చేసుకొనే, కొత్త ఆలో 800ను రూపొందించారు. అయితే, కొత్త ఆల్టో మాత్రం లీటరు పెట్రోల్‌కు 22.74 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లభిస్తున్న ఆల్టో మైలేజ్‌తో పోల్చుకుంటే కొత్త ఆల్టో 800 మైలేజ్ 15 శాతం ఎక్కువ. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా కొత్త ఆల్టో 800 కారు కోసం ఎదురుచూస్తున్నట్లయితే, తక్షణమే మీ ముందస్తు బుకింగ్‌ను రిజిస్టర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications









