అమ్మకాల వృద్ధిని తగ్గించుకున్న మారుతి సుజుకి
గడచిన జులై నెలలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జరిగిన అల్లర్ల కారణంగా ప్లాంట్ దాదాపు నెల రోజుల పాటు మూతపడటం, ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయి అమ్మకాలు గణనీయంగా తగ్గటం, అధిక వడ్డీ ధరలు, పెరుగుతున్న ఇంధన ధరలు, స్థిరత్వం లేని రూపాయి మారకపు విలువ మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ అమ్మకాల వృద్ధిని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించుకుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్ కార్ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ కార్ల ఉత్పత్తి కన్నా డీజిల్ కార్ల ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ యోచిస్తోంది. అందుకే, ఎక్కువగా డీజిల్ కార్లను ఉత్పత్తి చేసే గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. 2012లో డీజిల్ కార్లకు డిమాండ్ 36 శాతం ఉంటే అది 2011లో 47 శాతానికి, ప్రస్తుత సంవత్సరంలో 58 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది 60 శాతానికి చేరుకోవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









