లీటరుకు 30 కి.మీ. మైలేజీనిచ్చే మారుతి ఆల్టో 800 డీజిల్

కనమరుగై పోతున్న మారుతి 800 కారు స్థానాన్ని భర్తీ చేసేందుకు మారుతి సుజుకి ఇండియా ఓ సరికొత్త 'ఆల్టో 800' (కోడ్ నేమ్ వైఈ-3) అనే పేరుతో 800సీసీ కారునుఅభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఇందులో డీజిల్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం తమ మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్ప్‌తో చేరి ఓ 800సీసీ ట్విన్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఈ సరికొత్త డీజిల్ ఇంజన్ 40 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయటమే కాకుండా లీటర్ డీజిల్‌కు సుమారు 25-30 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనున్నట్లు సమాచారం. సరికొత్త ఆల్టో 800 కారు తొలుత పెట్రోల్ వేరియంట్‌లో ఈ ఏడాది దీపావళి నాటికి మార్కెట్లోకి రానుంది. అయితే, డీజిల్ వేరియంట్ విడుదలకు మాత్రం కాస్తంత సమయం పట్టేట్లు ఉంది. ప్రస్తుతం కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను వదలి డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, చిన్న కార్ సెగ్మెంట్లో డీజిల్ కార్లు అందుబాటులోకి వస్తే అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం ఖాయం.

ఇదే విషయాన్ని గ్రహించిన మారుతి సుజుకి ఆల్టో 800లో కూడా డీజిల్ వేరియంట్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం 'ఈ2' అనే కోడ్ నేమ్‌తో ఇరు కంపెనీలు ఈ డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి విడుదల సమయంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ నకనిషి వ్యాఖ్యానిస్తూ.. చిన్న డీజిల్ ఇంజన్లను చూడాలనేది తన కలని చెప్పారు. ఇప్పుడు ఆ కలను నిజం చేసే దిశగా మారుతి సుజుకి అడుగులు వేస్తుంది.

మారుతి సుజుకి చిన్న డీజిల్ ఇంజన్లను అందుబాటులోకి వస్తే.. ఇక చిన్న కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకికు పోటీగా ఎవ్వరూ నిలువలేరనేది మాత్రం ఖాయం. విశ్వసనీయమైన బ్రాండ్, విస్తృతమైన డీలర్, సర్వీస్ నెట్‌వర్క్, సాటిలేని మైలేజ్‌లే ఇండియాలో మారుతి సుజుకి స్థిరత్వానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, July 2, 2012, 11:56 [IST]
English summary
According to reports, Maruti Suzuki and its parent company Suzuki Motor Corp., Japan are jointly developing a two cylinder 800 cc diesel engine under codename E2. This all-new diesel engine is expected to deliver 40 hp power and 25-30kmpl mileage.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+