రూ 5.89 లక్షలకే మారుతి సుజుకి ఎర్టిగా
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈరోజు కొత్తగా మార్కెట్లోకి 'మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి'ని విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర పెట్రోల్ వేరియంట్ ఐతే రూ 5.89 లక్షలు కాగా.. అదే డీజిల్ వేరియంట్ రూ 7.30 లక్షలుగా నిర్ణయించింది. ఈ సంవత్సరం మారుతి సుజుకి నుండి వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రయోగాలను ఒకటి ఎమ్‌పివి మోడల్.
మారుతి సుజికి ఈ కారుని ఒక పెద్ద కుటుంబానికి సరిపోయే విధంగా రూపొందించింది. నిజం చెప్పాలంటే భారతీయులు భారీ శరీరాలకు పరిగణనలోకి ఈ కారుని రూపకల్పన చేశారు. ఈ కారుని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈవో సింజో నాకానిషి చేతుల మీదగా ముంబైలో విడుదల చేశారు. మార్కెట్లో ఈ కారు మూడు పెట్రోల వేరియంట్స్, మూడు డీజిల్ వేరియంట్స్‌లో లభ్యమవుతుంది.

వేరియంట్ ధర
మారుతి సుజికి ఎర్టిగా Lxi రూ.5.89 Lakhs
మారుతి సుజికి ఎర్టిగా Vxi రూ.6.60 Lakhs
మారుతి సుజికి ఎర్టిగా Zxi రూ.7.30 Lakhs
మారుతి సుజికి ఎర్టిగా Ldi రూ.7.30 Lakhs
మారుతి సుజికి ఎర్టిగా Vdi రూ.7.90 Lakhs
మారుతి సుజికి ఎర్టిగా Zdi రూ.8.45 Lakhs


Click it and Unblock the Notifications








