సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 12న మార్కెట్లోకి వస్తున్న ఎర్టిగా

భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి నుండి కార్ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి బహుళ ప్రయోజన వాహన (ఎమ్‌పివి) "ఎర్టిగా"ను వచ్చే గురువారం (ఏప్రిల్ 12, 2012) రోజున దేశీయ విపణిలోకి వాణిజ్య పరంగా ప్రవేశించినుంది. ఎర్టిగా ఎమ్‌పివిని మారుతి సుజుకి తొలిసారిగా గడచిన జనవరిలో ఢిల్లీలో జరిగిన 11వ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

ఇప్పటి ప్యాసింజర్ కార్లకు మాత్రమే పరిమితమైన మారుతి సుజుకి ఎర్టిగా విడుదలతో, అత్యంత పోటీతో కూడుకున్న ఎమ్‌పివి సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది. త్వరలో మార్కెట్లోకి రానున్న మహీంద్రా కొత్త జైలో, నిస్సాన్ ఇవాలియా, చెవర్లే ఎంజాయ్ మోడళ్లతోపాటుగా ఇప్పటికే ఈ సెగ్మెంట్లో పాతుకుపోయిన టొయోటా ఇన్నోవా, చెవర్లే తవేరా వంటి మోడళ్లకు మారుతి సుజుకి ఎర్టిగా పోటీగా నిలువనుంది.

Maruti Suzuki Ertiga Photo Gallery:

మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ 1.4 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను, 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్ టర్బో డీజిల్ ఇంజన్‌లను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ 70 కి.వా. గరిష్ట శక్తిని, 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇకపోతే, డీజిల్ వేరియంట్ 66 కి.వా. గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

Maruti Suzuki Ertiga At Delhi Auto Expo:

మారుతి సుజుకి ఎర్టిగా ధర రూ.7 లక్షల నుండి రూ.9 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబిల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్, ట్విన్ ఏసి, ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కాంపాటిబల్, 4+2 స్పీకర్స్), స్టీరింగ్‌పై ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) ఆడియో కంట్రోల్స్, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ సౌకర్యవంతమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి.

అంతేకాకుండా, సెంట్రల్ డోర్ లాకింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా లభించనున్నాయి. పెట్రోల్ వేరియంట్‌ ఎర్టిగా లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, April 6, 2012, 16:42 [IST]
English summary
The Maruti Suzuki Ertiga will be officially launched in India on 12th April. The Ertiga is expected to compete against the Toyota Innova and Mahindra Xylo. Maruti Suzuki will reveal the Ertiga's price on April 12.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+