స్విఫ్ట్ డిజైర్ మినహా అన్ని ఉత్పత్తుల ధరలను పెంచిన మారుతి

Maruti Price Hike
మారుతి సుజుకి కార్ల ధరలు మరోసారి పెరిగాయి. డీజిల్ కార్ల ధరలను పెంచి కేవలం రెండు నెలలు కూడా గడవక ముందే దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మరోసారి ధరలను పెంచింది. మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మినహా మిగిలిన అన్ని మోడళ్ల ధరలను రూ.17,000 లకు పైగా పెంచింది.

కంపెనీ అందిస్తున్న వివిధ మోడళ్లను బట్టి కార్ల ధరలు రూ.2,400 నుండి రూ.17,300 మేర పెరిగాయి. ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్ డిజైర్ సెడాన్ మార్కెట్లోకి వస్తుండటంతో ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు గానూ డిజైర్ సెడాన్ మినహా మిగిలిన అన్ని మోడళ్ల ధరలను పెంచినట్లు తెలుస్తోంది.

దీన్నిబట్టి చూస్తుంటే, పాత స్విఫ్ట్ డిజైర్ సెడాన్ ఉత్ప్తతిని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోన్నట్లుగా ఉంది. ఇదేగనుక జరిగితే, మారుతి 800 మాదిరిగానే పాత స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కూడా చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ఏదేమైనప్పటికీ.. అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తున్న కారణంగా ఉత్పత్తులను ధరలను పెంచక తప్పడం లేదనేది కంపెనీ వాదన.

More from DriveSpark

Article Published On: Tuesday, January 17, 2012, 15:57 [IST]
English summary
Maruti Suzuki has finally done it. While all major carmakers had announced an overall increase in car prices effective from January in December itself, Maruti Suzuki had only announced an increase in prices of its diesel cars only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+