కార్ల ధరలను రూ.5,250 మేర పెంచిన మారుతి సుజుకి
తాజా పెంపుతో మారుతి సుజుకి కార్లను కొనుగోలుచేసేవారు అదనంగా మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.5,250 లను చెల్లించాల్సి వస్తుంది. దేశీయ విపణిలో మారుతి సుజుకి తమ చిన్న కారు ఎమ్800 మొదలుకొని లగ్జరీ సెడాన్ కిజాషి వరకూ, అన్ని వర్గాల వారికి వివిధ రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి కార్ల ధరలు రూ.2.04 లక్షల నుంచి రూ.17.5 లక్షల రేంజ్‌లో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
చిన్న కార్ ప్రియులను, మద్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త ఆల్టో 800 కారును మారుతి సుజుకి ఈనెల 16న మార్కెట్లోకి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటి నుంచే ఈ చిన్న కారు కోసం ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తోంది. మరి మీ కొత్త ఆల్టో కారును మీరు బుక్ చేసుకున్నారా..?
మరోవైపు మారుతి సుజుకి బాటలోనే హోండా, జనరల్ మోటార్స్, ఆడి ఇండియా కంపెనీలు అక్టోబర్ 1, 2012 నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. హోండా అందిస్తున్న బ్రయో, జాజ్, సిటీ సెడాన్ ధరలను 2.6 శాతం మేర పెంచగా, ఆడి ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఆడి క్యూ3 ధరను 2 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. జనరల్ మోటార్స్ కూడా ఇదే కారణం చెప్పి అక్టోబర్ 1 నుంచి ధరలను పెంచుతామని ప్రకటించింది.


Click it and Unblock the Notifications









