పెట్రోల్ కార్లపై డీలర్ల మార్జిన్‌ను 10% వరకూ పెంచిన మారుతి
దేశీయ కార్ మార్కెట్లో అత్యధిక శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న మారుతి సుజుకి, డీజిల్ కార్లకు డిమాండ్ పెరగడం, దానికి అనుగుణంగా సప్లయ్‌ను అందించ లేకపోవడంతో మార్కెట్ వాటాను కోల్పోతుంది. ప్రస్తుతం భారత్‌లో మారుతి సుజుకి మార్కెట్ వాటా 40 శాతానికి పడిపోయింది. ఇంత తక్కువ స్థాయికి కంపెనీ మార్కెట్ వాటా క్షీణించడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో డీలర్ కమిషన్‌ను 8-10 శాతం మేర పెంచాలని మారుతి సుజుకి ఇండియా నిర్ణయించింది.
వ్యాగన్ఆర్, ఎస్టిలో, ఆల్టో పెట్రోల్ కార్ల అమ్మకాలపై డీలర్లకు మారుతి సుజుకి రూ.1,000 లను కమిషన్‌గా చెల్లిస్తుండగా, రిట్జ్, ఎస్ఎక్స్4 పెట్రోల్ మోడళ్లపై రూ.1,500, ఏ-స్టార్ మోడల్ అమ్మకంపై రూ.2,000 లను కమిషన్‌గా చెల్లిస్తుంది. గడచిన నెలలో కంపెనీ మోడళ్ల ధరను పెంచిన నేపథ్యంలో డీలర్ల మార్జిన్లను కంపెనీ సవరించింది. గడచిన పదేళ్లలో ఇలా డీలర్లకు ఇచ్చే కమిషన్లు మారుతి సుజుకి పెంచడం ఇది మొదటిసారి. మరి ఈ ఫీట్‌తో అయినా కంపెనీ పెట్రోల్ కార్ల అమ్మకాలు జోరందుకుంటాయో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications









