మారుతి సుజుకి మానేసర్ కొత్తగా 500 మంది ఉద్యోగాలు
ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియా మార్కెట్లో విక్రయిస్తున్న డీజిల్ కార్లకు డిమాండ్ జోరందుకోవటం ఉత్పత్తిని కూడా వేగవంతం చేయాలని కంపెనీ యోచిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త నియామాకాలను చేపట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త నియామకాల ద్వారా మానేసర్ ప్లాంటులోని రెండో యూనిట్‌లో ఉత్పత్తి వేగవంతం అయినట్లయితే, కంపెనీ నుండి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, కొత్త స్విఫ్ట్ డిజైర్ సెడాన్‌ల వెయింట్ పీరియడ్ భారీగా తగ్గనుంది.
ప్రస్తుతం ఈ మోడళ్లలో డీజిల్ కార్ల వెయింట్ పీరియడ్ ఆరు నెలలకు పైగా ఉంటోంది. త్వరలోనే ఇది నాలుగు నెలకు తగ్గే ఆస్కారం ఉందని కంపెనీ యోచిస్తోంది. అంతే కాకుండా, మానేసర్ ప్లాంటులో మారుతి సుజుకి మూడవ యూనిట్‌ను కూడా నిర్మిస్తోంది. మరికొద్ది నెలలో ఈ యూనిట్ కూడా నిర్వహణలోకి రానుంది. కొత్త నియమకాల గురించి మారుతి సుజుకి ఇండియా మేనేజింగ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్. సిద్దిక్వి మాట్లాడుతూ.. ప్లాంట్ బి (మానేసర్ ప్లాంటులోని రెండవ యూనిట్) కోసం మాకు మరింత మంది వర్కర్లు అవసరమవుతారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 మంది వర్కర్లను నియమించుకోనున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications









