స్విఫ్ట్, డిజైర్‌ల వెయింట్ పీరియడ్ తగ్గించేందుకు ప్లాన్స్
గుర్గావ్‌లో మారుతి సుజుకి ఇండియా ఏర్పాటు చేయనున్న డీజిల్ ఇంజన్ ప్లాంటు కోసం రూ.2,000 పెట్టుబడులను వెచ్చించనున్నామని కంపెనీ పేర్కొంది. కంపెనీ అందిస్తున్న స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ వంటి డీజిల్ కార్లకు డిమాండు అధికంగా ఉండటంతో వీటి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గానూ మరిన్ని డీజిల్ ఇంజన్లను తయారు చేయాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగానే గుర్గావ్‌లో ఈ తాజా పెట్టుబడులను వెచ్చించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1.5 లక్షల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. గత కొద్ది నెలలుగా కంపెనీ విక్రయిస్తున్న మోడళ్లలో 50 శాతానికిపైగా డీజిల్ కార్లే ఉన్నాయి. పెట్రోల్ మోడల్ కార్లకు పాపులర్ అయిన మారుతి సుజుకి, ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ మారటంతో డీజిల్ కార్లవైపు మొగ్గు చూపుతోంది.
ప్రస్తుతం మారుతి సుజుకి వార్షికంగా 3,00,000 డీజిల్ ఇంజిన్లను తయారు చేయగలదు. ఇది కాకుండా తాజాగా ఫియట్ ఇండియాతో కలిసి ఏర్పరుచుకున్న జాయింట్ వెంచర్ ద్వారా గుర్గావ్‌లో మరో 1,00,000 డీజిల్ ఇంజిన్ల తయారీని కంపెనీ చేపడుతోంది. గుర్గావ్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ఇంజన్ ప్లాంటులో మరో 3,00,000 డీజిల్ ఇంజిన్లను కంపెనీ తయారు చేయగలదు.
ఈ ప్లాంటును రెండు దశల్లో అమల్లోకి తీసుకురానున్నారు. తొలి దశలో భాగంగా 2013 మధ్య భాగం నాటికి 1.5 లక్షల ఇంజన్ల ఉత్పత్తి చేయనున్నారు. 2014 సంవత్సరం నాటికి ఈ ప్లాంటులో పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగి, ఈ ప్లాంటు నుండి వార్షికంగా ఏటా 3,00,000 ఇంజన్లను మారుతి సుజుకి ఉత్పత్తి చేయనుంది.


Click it and Unblock the Notifications








