జులై 2012లో పెరిగిన మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు
గడచిన నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 6.8 శాతం వృద్ధి చెంది 66,504 యూనిట్ల నుంచి 71,024 యూనిట్లకు పెరిగాయి. మారుతి సుజుకి తాజాగా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జులై 2012 మొత్తం అమ్మకాల్లో 11,413 యూనిట్లు స్విఫ్ట్ డిజైర్ సెడాన్లే ఉన్నాయి. అయితే, ఎమ్800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్ వంటి చిన్న కార్ల అమ్మకాలు 23.7 శాతం క్షీణించి 28,998 యూనిట్లుగా నమోదయ్యాయి.
స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, ఎస్టిలో, రిట్జ్ కార్ల అమ్మకాలు 73.2 శాతం వృద్ధిని సాధించి 15,759 యూనిట్లుగా నమోదయ్యాయి. మిడ్-సైజ్ సెడాన్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 అమ్మకాలు 70.5 శాతం వృద్ధి చెంది 679 యూనిట్లుగా నమోదు కాగా, కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ కిజాషి కేవలం రెండు కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు 27.4 శాతం వృద్ధి చెంది 8,796 యూనిట్ల నుంచి 11,210 యూనిట్లకు పెరిగాయి. కాగా.. జులై 21 నుంచి మానేసర్ ప్లాంట్ లాకౌట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల అమ్మకాలు రికార్డు స్థాయిలో క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications









