సరసమైన ధరకే సరికొత్త ఆల్టో 800ని విడుదల చేసిన మారుతి
ప్యాసింజర్ కార్ల తయారీలో భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) నుండి చిన్న కార్ ప్రియులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సరికొత్త 'ఆల్టో 800' కారు నేడు మార్కెట్లోకి విచ్చేసింది. కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఇటు పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్‌తోనూ, అటు సిఎన్‍జి ఫ్యూయెల్ ఆప్షన్‌తోను లభిస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా మూడు వేరియంట్లలో లభ్యం కానున్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్ ధరలు:
- ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 2.44 లక్షలు
- ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 2.76 లక్షలు
- ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 2.99 లక్షలు
కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్+సిఎన్‌జి ధరలు:
- ఆల్టో 800 స్టాండర్డ్ - రూ. 3.19 లక్షలు
- ఆల్టో 800 ఎల్ఎక్స్ - రూ. 3.37 లక్షలు
- ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - రూ. 3.70 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

మారుతి సుజుకి ఆల్టో 800 ఎక్స్టీరియర్స్
* వేవ్ ఫ్రంట్ డిజైన్
* స్టయిలిష్ ఫ్రంట్ బంపర్, గ్రిల్
* బాడీ కలర్డ్ బంపర్స్
* క్రోమ్ కోటెడ్ ఫ్రంట్ గ్రిల్
* బాడీ కలర్డ్ అవుట్ డోర్ హ్యాండిల్స్
* వీల్ కవర్స్

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంటీరియర్స్
* సి పిల్లర్ లోవర్ ట్రిన్ (మోల్డెడ్)
* క్యాబిన్ లైట్ (3 పొజిషన్స్)
* ఫ్లోర్ కార్పెట్
* ఫ్లోర్ కన్సోల్
* గ్రే/బ్రౌన్ ఇంటీరియర్ కలర్
* డబుల్ వినైల్/ఫ్యాబ్రిక్ సీటింగ్
* బి, సి పిల్లర్ అప్పర్ ట్రిమ్స్
* స్పీడోమీటర్‌లో సిల్వర్ కోటింగ్
* లోపలివైపు డోర్ హ్యాండిల్స్‌పై సిల్వర్ కోటింగ్
* డోర్ ట్రిమ్ ఫ్యాబ్రిక్ ఇన్‌సెర్ట్
* మెటాలిక్ ఫినిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్
* ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‍పై సిల్వర్ కోటింగ్
* డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ సన్‌విజర్

మారుతి సుజుకి ఆల్టో 800 కంఫర్ట్ ఫీచర్స్
* అసిస్ట్ గ్రిప్స్ (కో-డ్రైవర్, రియర్ ప్యాసింజర్స్)
* 1-లీటర్ బాటిల్ హోల్డర్
* క్యాన్ హోల్డర్
* డ్యూయెల్ టైప్ క్లైమేట్ కంట్రోల్
* కాయిన్ హోల్డర్
* డ్రైవర్ సైడ్ స్టోరేజ్ స్పేస్
* ప్యాసింజర్ సైడ్ యుటిలిటీ పాకెట్
* డ్యూయెల్ ట్రిప్ మీటర్

మారుతి సుజుకి ఆల్టో 800 కంఫర్ట్ ఫీచర్స్
* హీటర్‌తో కూడిన ఎయిర్ కండిషనర్
* ఫ్రంట్ డోర్ ట్రిమ్ మ్యాప్ పాకెట్ (డ్రైవర్ సైడ్)
* రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్
* ఫ్రంట్ పవర్ విండోస్
* పవర్ స్టీరింగ్
* స్పీడోమీటర్ డిస్‌ప్లేలో డిజిటల్ క్లాక్
* రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్
* కారు లోపలి నుంచి సర్దుబాటు చేసుకునే వీలున్న డ్రైవర్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్

మారుతి సుజుకి ఆల్టో 800 సేఫ్టీ ఫీచర్స్
* హెడ్‌లైట్ లెవలింగ్
* హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్
* ఇమ్మొబిలైజర్
* ఫ్రంట్ వైపర్, వాషర్
* కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్
* ట్యూబ్‌లెస్ టైర్స్
* ఆప్షనల్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్

మారుతి సుజుకి ఆల్టో 800 ఇంజన్
* రీడిజైన్డ్ 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్
* 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తి
* 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్
గడచిన వారంలో విడుదలకు ముందే 6,500 బుకింగ్‌లను సొంతం చేసుకొని సరికొత్త ఆల్టో 800కు ఇప్పుడు 10,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ 800సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
కొత్త ఆల్టో 800 మైలేజ్:
- పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: లీటరుకు 22.74 కి.మీ.
- సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: కేజీకి 30.46 కి.మీ.
(రెండు మైలేజ్‌లు కూడా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)
పాత వెర్షన్ ఆల్టో 800 కారుతో పోల్చుకుంటే కొత్త ఆల్టో 800 పెట్రోల్ వెర్షన్ మైలేజ్ 15 శాతం, సిఎన్‌జి వెర్షన్ మైలేజ్ 13 శాతం అధికమని కంపెనీ తెలిపింది. కొత్త ఆల్టో 800 కారుకు సంబంధించిన సరికొత్త సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








