రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త మారుతి సుజుకి ఆల్టో 800
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. చిన్న కారు ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. మారుతి సుజుకి బుధవారం రోజన తమ కొత్త ఆల్టో 800 కారును రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్‌లో మారుతి సుజుకి అధీకృత డీలర్ వరుణ్ మోటార్స్, బేగంపేట షోరూమ్‌లో కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారును రాష్ట్ర ఐటి శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతుల మీదుగా అవిష్కరించింది.
హైదరాబాద్ మార్కెట్లో కొత్త ఆల్టో 800 పెట్రోల్ వెర్షన్ కారు ధరలు రూ.2.47 లక్షల నుంచి రూ.3.21 లక్షల (ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉండగా, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు రూ.3.23 లక్షల నుంచి రూ.3.64 లక్షల (ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి. ప్రతి వెర్షన్ కూడా వేరియంట్లలో (స్టాండర్డ్, ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ) లభిస్తుంది. కొత్త మారుతి సుజుకి ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (ఫ్రోస్ట్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, టార్క్ బ్లూ, గ్రానైట్ గ్రే, సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్) అందుబాటులో ఉంది. ఫ్రోస్ట్ బ్లూ, గ్రానైట్ గ్రే కలర్స్ కేవలం ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర మార్కెట్లో లభ్యమయ్యే మారుతి సుజుకి ఆల్టో 800 వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 ధరలు:
- మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 2.50 లక్షలు (మెటాలిక్) - రూ. 2.47 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 2.83 లక్షలు (మెటాలిక్) - రూ. 2.80 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.06 లక్షలు (మెటాలిక్) - రూ. 3.03 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ (ఎయిర్‌బ్యాగ్) - 3.21 లక్షలు (మెటాలిక్) - రూ. 3.18 లక్షలు (నాన్-మెటాలిక్)
సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 ధరలు:
- మారుతి ఆల్టో 800 స్టాండర్డ్ - 3.27 లక్షలు (మెటాలిక్) - రూ. 3.23 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ - 3.45 లక్షలు (మెటాలిక్) - రూ. 3.42 లక్షలు (నాన్-మెటాలిక్)
- మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ - 3.64 లక్షలు (మెటాలిక్) - రూ. 3.61 లక్షలు (నాన్-మెటాలిక్)
కొత్త ఆల్టో 800 ఇంజన్:
కొత్త ఆల్టో 800 కారులో రీడిజైన్డ్ ఎఫ్8డి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
కొత్త ఆల్టో 800 మైలేజ్:
* పెట్రోల్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: లీటరుకు 22.74 కి.మీ.
* సిఎన్‌జి వెర్షన్ వెర్షన్ మారుతి సుజుకి ఆల్టో 800 మైలేజ్: కేజీకి 30.46 కి.మీ.
(రెండు మైలేజ్‌లు కూడా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)


Click it and Unblock the Notifications








