మారుతి సుజుకి అత్యంత విశ్వసనీయ బ్రాండ్: అధ్యయనం

Maruti Trusted Brand
భారతదేశం వంటి దేశాలు బ్రాండ్లకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంలో ముందుంటాయి. మరీ ముఖ్యంగా రోజూవారీ రవాణా కోసం లేదా బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు గానూ ఓ వాహనాన్ని సొంతం చేసుకునే విషయంలో సదరు ఆటోమొబైల్ బ్రాండ్‌కు ఎంతగానో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మారుతి సుజుకి ఒకడుగు ముందే ఉంది. దీని విస్తృతమైన నెట్‌వర్క్, ఈ బ్రాండ్ పట్ల వినియోగదారుల్లో నెలకొన్న విశ్వసనీయతల కారణంగా ఇది అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా అవతరించింది.

బ్రాండ్ ట్రస్ట్ అడ్వైజరీ అనే సంస్థ నిర్వహించిన "ది బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్, ఇండియా స్టడీ 2012" ప్రకారం, మారుతి సుజుకి అత్యంత విశ్వసనీయమైన ఆటోమోటివ్ బ్రాండ్‌గా తేలింది. ఈ జాబితాలో మారుతి సుజుకి తర్వాత, జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ, ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా, టొయోటా మరియు హోండా బ్రాండ్‌లు నిలిచాయి. ఈ జాబితాలో టాప్ టెన్ లిస్ట్‌లో ఫోర్డ్, ఆడి, స్కొడా, హీరో, యమహా బ్రాండ్‌లు కూడా స్థానం సంపాధించుకున్నాయి.

అయితే, భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తృతీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కంపెనీలు మాత్రం ఈ జాబితాలోని టాప్ టెన్ లిస్ట్‌లో స్థానం దక్కించుకోలేకపోవటం కాస్తంత విచారకర విషయమే. ఇక అత్యంత విశ్వసనీయ కార్‌గా మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ నిలువగా, అత్యంత విశ్వసనీయ లగ్జరీ బ్రాండ్‌గా బిఎమ్‌డబ్ల్యూ నిలిచింది. ప్రస్తుతం భారత రోడ్లపై సంచరిస్తున్న ప్రతి నాలుగు కార్లలో ఒక్కటి మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందినదంటేనే ఈ బ్రాండ్ ఎంతటి విజయాన్ని సాధించో తెలిసిపోతుంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Wednesday, January 18, 2012, 14:17 [IST]
English summary
Maruti Suzuki has not only been the market leader in terms of sales it is also the most preferred car brand in India. Here is another proof of Maruti Suzuki's dominance of the Indian car market. Brand Trust Advisory in its survey has revealed that the Indian carmaker is the most trusted auto brand in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+