రిట్జ్‌లో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్న మారుతి!

మారుతి సుజుకి అందిస్తున్న చౌవకైన కారు రిట్జ్ త్వరలోనే తన రూపురేఖలు మార్చుకొని సరికొత్త లుక్‌తో మార్కెట్లో దర్శనివ్వబోతుంది. మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌కు ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ కారుకు ఫేస్‌బుక్‌లో సుమారు 9 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారంటనే ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

పెట్రోల్, డీజిల్ వేరింట్లలో తక్కువ ధరకే లభిస్తుండటమే ఇందుకు కారణం. మారుతి సుజుకి స్విఫ్ట్, రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఉపయోగించే ఇంజన్లు రెండూ కూడా ఒకే పవర్‌ను కలిగి ఉంటాయి. పెర్ఫామెన్స్ విషయంలో ఈ రెండింటికి పెద్ద తేడా ఏమీ కనిపించదు.

మారుతి సుజుకికు రిట్జ్ హ్యాచ్‌బ్యాక్ కూడా స్విఫ్ట్ మాదిరిగానే గ్లోబల్ మోడల్. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు మోడళ్లకు మంచి క్రేజ్ ఉంది. గడచిన సంవత్సరం ఆగస్టు నెలలో స్విఫ్ట్ అదనపు హంగులు జోడించి సరికొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిట్జ్‌లో కూడా ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

కొత్త మోడల్‍‌ను ఇప్పటికే మారుతి సుజుకి ట్రైల్ రన్ కూడా నిర్వహిస్తోంది. పాత స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఇంజన్లు, ప్రస్తుతం రిట్జ్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లు రెండూ కూడా ఒక్కటే. కొత్త స్విఫ్ట్‌లో కంపెనీ మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొత్త రిట్జ్‌లో కూడా అదే ఇంజన్‌ను మారుతి సుజుకి ఆఫర్ చేసే అవకాశం ఉంది.

అంతేకాకుండా.. రిట్జ్‌లో డ్యూయెల్ ఫ్యూయెల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడిన వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేరియంట్ పెట్రోల్, సిఎన్‌జీ ఇంధన ఆప్షన్లతో పనిచేయనుంది. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, అధిక హెడ్ రూమ్, సరసమైన ధర, సౌకర్యవంతమైన సీటింగ్‌ల కారణంగా ఈ మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.

కొత్త రిట్జ్ మార్కెట్లోకి విడుదలైతే స్విఫ్ట్ అమ్మకాలపై ప్రభావం పడే ఆస్కారం ఉంది. స్విఫ్ట్‌కు ఇప్పటికే అధిక వెయిటింగ్ పీరియడ్ ఉండటం వలన స్విఫ్ట్ కొనాలనుకునే వారు రిట్జ్‌తో సరిపెట్టుకుంటున్నారు. మరి కొత్త స్విఫ్ట్ కొనుగోలుదారులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి. కొత్త రిట్జ్‌కు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, February 17, 2012, 16:08 [IST]
English summary
The Maruti Suzuki Ritz has long been in the shadow of the Swift despite sharing the same petrol and diesel engines. The Ritz has been appreciated by its buyers. It also has a long list of fans too. The Maruti Suzuki Ritz's Facebook fan page currently has more than nine lakh fans. Now thats something for a car that has always been considered as a cheaper alternative to the Swift.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+