కార్మికుల కోసం వసతి సౌకర్యం: మారుతి సుజుకి
తమ కార్మికుల సరైన వసతి సౌకర్యాలను కల్పించాలని భావిస్తున్నామని మారుతి సుజుకి ఇండియా ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్.వై. సిద్ధిఖి తెలిపారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 5,000 మంది కార్మికులు వసతి సౌకర్యాన్ని పొందనున్నారు. కార్మికుల సమస్యలపై దృష్టి సారించేందుకు ఎంప్లాయిస్ కో-ఆపరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ కమిటీ కార్మిక సమస్యలపై రంగంలోకి దిగుతుందని ఆయన చెప్పారు.
సుమారు ఐదు వేల మంది ఉద్యోగులకు తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల పథకాన్ని సమీక్షించే బాధ్యత కూడా కమిటీకే అప్పగించనున్నట్లు సిద్ధిఖి చెప్పారు. కాగా.. కంపెనీ ఇటీవలే గుర్గావ్ ప్లాంట్ కార్మికుల వేతనాలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ కార్మికుల జీతాలను ఏకంగా 75 శాతం (నెలకు రూ.18,000) పెంచుతున్నట్లు కంపెనీ పెంచింది. గడచిన జులై నెలలో మానేసర్ కార్మికులు అల్లర్లకు పాల్పడి ప్లాంటులో భారీ ఆస్తి నష్టాన్ని కలిగించడమే కంపెనీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) మరణానికి కూడా కారమైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









