మారుతి సుజుకి ఇండియా క్యూ3 లాభాలు మటాష్..!!

Maruti Sales Down
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) గడచిన మూడో త్రైమాకంలో కూడా చేదు ఫలితాలే నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో డిసెంబర్ నెలతో ముగిసిన మూడవ త్రైమాసికం (క్యూ3)లో కంపెనీ నికర లాభం ఏకంగా రూ.205.6 కోట్లకు పడిపోయి 63.6 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.565.17 కోట్లుగా ఉన్నట్లు మారుతి సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే కాలానికి కంపెనీ నికర అమ్మకాలు కూడా 17.4 శాతం క్షీణించి రూ.7663.6 కోట్లకు పడిపోయాయి. ఇదివరకటి సంవత్సరంలో ఇవి రూ.9276.73 కోట్లుగా ఉన్నాయి. కార్మిక సమస్యలు, మార్కెట్ మందగమనం కారణంగా అమ్మకాలు తగ్గి, ఫలితంగా లభాలు కూడా తగ్గాయని కంపెనీ పేర్కొంది.

గడచిన 12 త్రైమాసికాలలో కంపెనీ ఎన్నడూ కూడా ఇలాంటి నిరుత్సాహకర ప్రతిభను కనబరచలేదు. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, వడ్డీ రేట్లు కూడా కంపెనీ లాభాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో తలెత్తిన కార్మికుల సమ్మె కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో సుమారు 40,000 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయామని, ఈ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది.

అక్టోబర్-డిసెంబర్ 2011 త్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు 27.56 శాతం క్షీణించి 2,39,528 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,11,803 వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించగా, 27,725 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ మొత్తం అమ్మకాలు 3,30,687 యూనిట్లుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 24, 2012, 12:52 [IST]
English summary
Maruti Suzuki, India's leading carmaker has posted a massive 63.6 per cent drop in profits during the third quarter of the financial year. The carmaker which posted its Q3 results said it could only manage a net profit of Rs.206 crores as compared to the Rs.565 crores it managed to earn in the third quarter of 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+