మారుతి చరిత్రలో మరో రికార్డ్: ఒక కోటి కార్ల అమ్మకాలు
మారుతి సుజుకి ఇండియాకు నిజంగా ఇది పండుగ సమయం అని చెప్పాలి. గడచిన మూడు దశాబ్ధాలకు పైగా భారత్‌లో ప్యాసింజర్ కార్లను తయారు చేస్తూ, ప్రజల రవాణా అవసరాలను తీరుస్తున్న మారుతి సుజుకి నేటితో కోటి కార్ల మార్కును అధిగమించింది.
భారత మార్కెట్లో ఒక్క కోటి కార్లను విక్రయించడానికి కంపెనీకు 29 ఏళ్ల సమయం పట్టింది. మానేసర్ ప్లాంటులో తయారైన కోటవ కారు "రెడ్ స్విఫ్ట్ విఎక్స్ఐ"ను ఈ రోజు ఉదయం కోయంబత్తూర్‌కు డిస్పాచ్ చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
డిసెంబర్ 1983లో తొలిసారిగా ఎమ్800 కారును మారుతి సుజుకి ఉత్పత్తి చేసింది. ఫిబ్రవరి 2006 నాటికి దేశీయ అమ్మకాలలో కంపెనీ 50 లక్షల మార్కును చేరుకుంది. ఈసారి తర్వాతి 50 లక్షల మార్కును కేవలం ఆరేళ్లలోపే చేరుకుంటామని మారుతి సుజుకి ధీమా వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications









